ప్రేమ అనుబంధానికి ప్రతీక రాఖీ

 . అన్న చెల్లెల ఆత్మీయ ప్రతీక.
. కిటకిటలాడుతున్న స్టాళ్లు, స్వీట్ హౌస్ లు
 నాంపల్లి ఆగస్టు 12 (జనం సాక్షి )రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్లు ప్రేమానుబంధానికి ప్రతీక. ఎక్కడెక్కడ ఉండే సోదరి సోదరీమణులు తమ ప్రేమకు,అభిమానానికి గుర్తుగా తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తారు. అక్క చెల్లెలు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది, చేతికి ప్రేమగా రాఖీ కట్టి, మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తికొద్దీ కానుకలిస్తారు. ఒకరికొకరు తీపి తినిపించు కొని తమ అనుబంధాన్ని పంచుకుంటారు. కాలానుగుణంగా రాఖీలు కొత్త కొత్త డిజైన్ల లో వస్తున్నాయి. గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మండల కేంద్రంలో భారీగా దుకాణాలు వెలిశాయి. పండుగ సందర్భంగా మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. రాఖీ స్టాల్స్ తో పాట స్వీట్ హౌస్ లు, ఇతర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.