ప్రైవేటు స్కూల్ యజమానుల చేతిలో కీలుబొమ్మగా మారిన జిల్లా విద్యాశాఖ అధికారులు.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 28 జనం సాక్షి.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో మీలాదిన్ నబి
గవర్నమెంట్ హాలిడే అయినా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ జిల్లాల్లో ప్రవేట్ స్కూల్ యజమానులు చెప్పు చేతల్లో మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు ఉండడంతో జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం అది కనబడడం లేదని, తమ ఇష్టం వచ్చినట్లు స్కూలు నడుపుతున్న పట్టించుకునే నాథుడే లేడని, సెలవు రోజుల్లో కూడా స్కూలు నడపడం, రోజువారీగా నడిపే స్కూల్లో కూడా తమకు ఇష్టం వచ్చిన టైమింగ్స్ పెట్టుకుని పిల్లలపై భారం పడుతున్న కూడా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయకుండా, సంబంధిత రిజిస్టర్లను విద్యాశాఖ అధికారుల దగ్గరికి పోయి తనిఖీలు చేపట్టినట్లు సంతకాలు చేయించుకుంటున్నారని, ఒకవేళ అలా చేయకపోతే తమ రాజకీయ నాయకులని పురిగల్పి ఆ విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి తేవడం వల్ల తమకు పట్టి పట్టనట్లు విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రవేట్ స్కూల్లో పిల్లలకు ఒక పిరియడ్ క్రీడలను ఆడించాలని ఉన్న ఎక్కడ కూడా అది జరగడంలేదని, ఇరుకు సందులలో, గుడిసెలలో, అపార్ట్మెంట్లలో, సరైన వెల్తురు గాలి లేని స్థలాల్లో, కొన్ని స్కూళ్లలో పిల్లలకు కూడా మూత్రశాల లేవని, ఉన్న కొన్ని స్కూళ్లలో మూత్రశాలలు మరుగుదొడ్లను శుభ్రం చేయడం లేదని, కంపు కొడుతున్న కూడా ఎవరు పట్టించుకోవడంలేదని, వసతులు సరిగా లేకున్నా పిల్లలకు విద్య నేర్పుతున్న ప్రైవేటు యజమానులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని అటువంటి స్కూల్ పై కఠినమైన చర్య తీసుకోవాలని , ఈ విషయంపై డిఇఓ వివరాల కొరకు ప్రజాసంఘాల నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా సిపిఐ కార్యదర్శి బి. ఆంజనేయులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేద ని ఇటువంటి డి ఈ ఓ పై చర్యలు తీసుకోవాలన్నారు.