ప్రైవేట్‌ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి
కరీంనగర్, నవంబర్ 23 : పట్టణంలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిపై ఆరోపణలు వెలువెత్తడంతో ఆసుపత్రిని సీజ్ చేసినట్టు డిఎం హెచ్‌ఓ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రులు రోగులకు మెరుగైన సదుపాయలు కల్పించడంలో విఫలమయ్యాయని, అంతేగాక రోగుల పట్ల స్పందన తక్కువగా ఉన్నదని ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రులు విష్ఠానుసారంగా రోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారనిన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు రావడంతో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఆసుపత్రిని సీజ్ చేశామని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో రోగులకు కనీసం మౌలిక సదుపాయలు కల్పించాలని ఆయన ఆసుపత్రి యజమాన్యాన్ని గుర్తు చేశారు.