ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి

-వైద్యుడి నిర్లక్ష్యం అంటు బందువులు ఆస్పత్రి ముందు నిరసన.

-పోలీసులు రంగప్రవేశం.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 4 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రం లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు సోమవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక యస్ఐ నరేష్ పోలీస్ సిబ్బంది తో హాస్పిటల్ వద్దకు చేరుకుని మృతిరాలి బంధువులకు నచ్చ చెప్పడంతో వారు శాంతించారు.బాధితుల కథనం ప్రకారం వడ్డేపల్లి మండలం శాంతినగర్ కు చెందిన షేక్ నజియా(26) కడుపు నొప్పి రావడంతో బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఆదివారం ఉదయం 11 గంటల ప్రాతం లో తీసుకొచ్చారు. ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత నయమవుతుందని డాక్టర్లు తెలిపారు.సాయంత్రం వరకు షేక్ నజియా బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఆదివారం రాత్రి 8 గంటల కు వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పి డాక్టరు వెళ్లిపోయారు. చేసేదేమిలేక 108 అంబులెన్స్ ఫోన్ చేసి కర్నూలు లో ఉన్న మరో ఆసుపత్రికి తీసువెళుతుండగా షేక్ నజియా చనిపోయి చాలాసేపాయిందని వారు తెలిపారు.డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందని భర్త హిజరత్ భాష ఆరోపించారు. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు సోమవారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. శాంతినగర్ పట్టణంలో ఇలాంటి కేసులు ఎన్నో జరుగుతున్న స్థానిక చోట మోట లీడర్లతో ఆసుపత్రి యజమానులు కుమ్మక్కై ఇలాంటి కేసులను బయటకు పక్కన చేస్తున్నట్లు వారి బంధువులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య అధికారులు ప్రవేట్ ఆసుపత్రులపై నిఘాని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

తాజావార్తలు