ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలి.

అనుమతి లేకుండా  నోటుబుక్ విక్రయించే పాఠశాలల అనుమతి రద్దు చేయాలి          తూప్రాన్( జనం సాక్షి) జూన్ 27::
తూప్రాన్ డివిజన్ కేంద్రంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని ప్రైవేట్ స్కూలు వారికి ఇష్టం ఉన్నట్లు వేలకు వేలు వసూలు చేస్తున్నారని ఫీజుల నియంత్రణ చర్యలు వెంటనే చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా  కార్యదర్శి సంతోష్,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు  మహేందర్ రెడ్డి  డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 1 ప్రకారం 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత సీట్లు ఇవ్వాలనీ ఈ ఒక్క పాఠశాలలో కూడా ఉచిత విద్య లేనేలేదని ఫీజులు కట్టని వారిని పరీక్షలకు రాయనివ్వడం లేదని  అన్నారు ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతి లేకుండా వారి ఇష్టమున్న రేట్లతో తో నోట్ బుక్స్ వర్క్ బుక్స్ ఇతర బుక్స్ అంటూ కేవలం పుస్తకాలకే వేలకు వేలు వసూలు చేస్తున్నారని వాటిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పుస్తకాలకు అంటూ ఒక్కో విద్యార్థి దగ్గర మూడు వేల నుండి పదివేల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు ప్రైవేట్ స్కూల్లో బుక్స్ అమ్మాలంటే డీఈవో ఎంఈఓ మున్సిపల్ లేదా గ్రామపంచాయతీ పర్మిషన్ ఉండాలన్నారు కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా స్కూల్లోనే విచ్చలవిడిగా చేస్తున్నారు అలాగే ఫీజులు కూడా కరోనా ముందు కంటే ఈసారి విద్యార్థుల దగ్గర విచ్చలవిడిగా దోచుకుంటున్నారు కావున ప్రైవేట్ స్కూల్లో ఫీజులు దోపిడీ అలాగే పర్మిషన్ లేకుండా బుక్స్ అమ్ముతున్న  ప్రైవేట్ స్కూల్ల గుర్తింపును రద్దు చేయాలని అన్నారు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, సీఐటీయూ నాయకులు గుడాల రవీంద్ర ప్రసాద్ డివిజన్ కార్యదర్శి రమేష్, తదితరులు పాల్గొన్నారు