ప్లాస్టిక్‌ను నిషేధించండి పర్యావరణన్నీ కాపాడండి.

*జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ శ్రీనివాస్. తూప్రాన్ (జనం సాక్షి) జూన్ 6:: ప్రతి ఒక్కరూ పర్యావరణ రహిత ఉత్పత్తులను మాత్రమే వాడాలని జిఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ పేర్కొన్నారు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని
జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ మరియు ఎంపవర్ ఎంపవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తూప్రాన్ టోల్ ప్లాజా సమీపంలో స్వయం సహాయక మహిళ సంఘాలు చేతితో తయారు చేసిన జ్యూట్ ఉత్పత్తుల స్టాళ్లను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఈ జ్యూట్ ఉత్పత్తుల స్టాళ్లను ఎం ఎస్ వి ప్రతినిది హజరత్ రెడ్డి ఎంపీవర్ ట్రస్ట్ ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణానికి ప్రాణాంతకమైన ప్లాస్టిక్ ను పూర్తిగా మెసేజ్ విధించాలని ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్లను వాడడం కర్తవ్యం గా పెట్టుకొని వాడవద్దని ఆయన సూచించారు ప్రతి ఒక్కరూ పర్యావరణ రహిత ఉత్పత్తులను వాడాలని అలాగే మహిళా సాధికారత తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ సాధికారత అనేది జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ యొక్క ఒక ప్రత్యేక చొరవ అని, ఇది స్వయం సహాయక సంఘాల మహిళలలు చేతితో తయారు చేసిన ఉత్పత్తులను తయారు చేయడానికి మరియు మార్కెట్ చేయడానికి వీలుకల్పిస్తుందని,  ఈ చొరవ వివిధ ప్రదేశాల నుండి జి.యం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్తో అనుబంధించబడిన స్వయం సహాయక బృందాలు లేదా దేశవ్యాప్తంగా హస్తకళల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ఇతర ఎన్జీవోలు మరియు సమూహాలచే తయారు చేయబడిన ఉత్పత్తులపై దృష్టి పెడుతు వారికీ సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.యం.అర్ పోచంపల్లి హైవేస్ సిబ్బంది, రక్షా సిబ్బంది శ్రీనివాస్, నాగరాజు, ఏసుదాసు, సుమన్ రెడ్డి , మల్లేశం, సుల్తాన్, భీంరావు, శరత్ చంద్ర ఫౌండేషన్ వాలంటీర్ పోచలు పాల్గొన్నారు