ఫార్మాకంపెనీ దిగ్జజాలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

123

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మెర్క్‌, ఫైజర్‌ కంపెనీలతో సమావేశం

తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చ

ఫార్మాసిటీ ఏర్పాటును వివరించిన మంత్రి

తెలంగాణకు రావాల్సిందిగా అహ్వానం

న్యూయార్క్‌,అక్టోబర్‌ 14(జనంసాక్షి):పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అమెరికాలో రెండోరోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఫార్మస్యూటికల్‌ విభాగ చైర్మన్‌ పాల్‌ స్టోఫెల్‌ తో సమావేశం  అయ్యారు. అయతోపాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ టాప్‌ లీడర్‌ షిప్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది భారత్‌ లో పర్యటించనున్నట్లు తెలిపిన  పాల్‌, తెలంగాణకు వస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ గురించి మంత్రి వివరించారు. పాల్‌ ఫార్మా సిటీ పట్ల ఆసక్తి వ్యక్తం  చేశారు. తెలంగాణలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ యూనిట్‌ ఏర్పాటు  చేయాల్సిందిగా ఏఒజీపబ అఇూ ఓవశ్రీతినిటజీ ను మంత్రి కోరారు. హైదరాబాద్‌ లో జాన్సన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని అమె హవిూ ఇచ్చారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తో తెలంగాణ ప్రభుత్వం ఒక యంవోయు కుదుర్చుకున్నది.ఈ యంవోయు ద్వారా తెలంగాణను టిబి (వ్యాధి) రహిత రాష్ట్రంగా నిలిపేందుకు కంపెనీ సహకారం అందించనున్నది. మరో ప్రముఖ ఫార్మా దిగ్గజం మెర్క్‌ కంపెనీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు

సనత్‌ చటోపాద్యాయ్‌ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలో డయేరియా మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకారం అందిస్తామని, తెలంగాణలో మరిన్ని సేవా కార్యాక్రమాల్లో పాల్గొనేందుకు సనత్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణలోని  పెట్టుబడుల అవకాశాల పరిశీలనకు రావాలన్న మంత్రి అహ్వనం మేరకు సనత్‌ వచ్చే నెల హైదరాబాద్‌ రానున్నారు. స్ధానికంగా ఉన్న సంస్థలతో కలసి తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సిధ్ధంగా ఉన్నట్లు మెర్క్‌ కంపెనీ తెలిపింది. నగరంలో వాక్సిన్‌ ఏక్సలెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు సైతం కంపెనీ ముందకు వచ్చింది. దీని ద్వారా వాక్సిన్‌ తయారీ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం పనిచేస్తుంది. ఫైజర్‌ కంపెనీ గ్లోబల్‌ హెడ్‌ (ఇన్నోవేషన్స్‌) నానెట్‌ సోసెరో మరియు ఇతర సీనియర్‌ ప్రతినిధుల బృందంతో మంత్రి సమావేశం అయ్యారు. బ్రెస్ట్‌ కాన్సర్‌ నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన ఇఅఊూ ప్రాజెక్టు గురించి కంపెనీ మంత్రికి వివరించింది. ఫార్మా రంగంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ అఫ్‌ హైదరాబాద్‌ (ఖీఎఅఊ) ప్రాజెక్టులో

భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎహ2 ంశ్రీశ్రీతిజీనిఞవ, (ఙూఈఆం భాగస్వామ్యంతో ఏర్పడినది) కుదుర్చుకున్న మరో యంవోయు కార్యక్రమంతో మంత్రి పాల్గొన్నారు. ఈ యంవోయు ద్వారా పార్మసిటి ద్వారా మెడికల్‌ మరియు హెల్త్‌ కేర్‌ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆవిష్కరణలను ఒక చోటికి తీసుకువచ్చే

ప్రయత్నంగా ఙూఈఆం పేర్కొన్నది.పరిశోధన, అభివృద్ధి, నైపుణ్యం, ఆవిష్కరణ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. గ్లోబల్‌ ఫార్మా ఛైర్మన్‌ పాల్‌ స్టోఫెల్స్‌తో సమావేశమైన కేటీఆర్‌ వైద్య ఉపకరణాలు, ఔషధాల తయారీపై చర్చించారు. రాష్ట్రంలో జే ల్యాబ్స్‌ ఏర్పాటుపైనా చర్చించారు. ఫైజర్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. మరోవైపు గ్లోబల్‌ ఫార్మా ఛైర్మన్‌ పాల్‌ స్టోఫెల్స్‌తో సమావేశం సందర్భంగా వైద్య ఉపకరణాలు, ఔషధాల తయారీపై చర్చించారు. అదేవిధంగా రాష్ట్రంలో జే ల్యాబ్స్‌ ఏర్పాటుపైనా మంత్రి చర్చించినట్లు సమాచారం.

గ్లోబల్‌ ఫార్మా, మెర్క్‌ కంపెనీలు రాష్ట్రంలో పర్యటనకు అంగీకారం

ఫార్మా దిగ్గజం మెర్క్‌ కంపెనీ కార్యనిర్వాహఖ ఉపాధ్యాక్షుడు సనత్‌ చోటపాధ్యాయతో సమావేశమైన మంత్రి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కేటీఆర్‌ ఆహ్వానం మేరకు మెర్క్‌ కంపెనీ ప్రతినిధులు వచ్చే నెల నగరానికి రానున్నారు. తెలంగాణలో డయేరియాను తరిమికొట్టేందుకు సహకారం అందిస్తామని కంపెనీ తెలిపినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా మెర్క్‌ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు. నగరంలో వ్యాక్సిన్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు మెర్క్‌ కంపెనీ ముందుకొచ్చింది. దీని ద్వారా వ్యాక్సిన్‌ తయారీ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రం పని చేస్తుంది. గ్లోబల్‌ ఫార్మా చైర్మన్‌ పాల్‌ స్టోఫెల్స్‌తో సమావేశమైన కేటీఆర్‌ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీ గురించి వివరించారు. ఫార్మా సిటీ పట్ల పాల్‌ స్టోఫెల్స్‌ ఆసక్తి కనబరిచినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జాన్సన్‌ ల్యాబ్స్‌ ఏర్పాటుపై ఆ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్‌ చర్చించారు. హైదరాబాద్‌లో జాన్సన్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తామని చెప్పినట్లు మంత్రి తెలిపారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. తెలంగాణను టీబీ వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ సహకరించనుంది.  ఫైజర్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా కేటీఆర్‌కు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నిర్దారణ కోసం ఏర్పాటు చేసి ఈసీహెచ్‌ ప్రాజెక్టు గురించి వివరించారు. ఫార్మారంగంతో పాటు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు చేయనున్న రిచ్‌ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని మంత్రి వారిని కోరారు. యూఎస్‌ఎఫ్‌డీఏతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఫార్మా సిటీ ద్వారా మెడికల్‌, హెల్త్‌కేర్‌ రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆవిష్కరణలను ఒకే చోటుకు తీసుకొచ్చేందుకు ఒప్పందం జరిగింది.