ఫిక్సింగ్‌పై ప్రశిస్తే… ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయిన అజర్

635985568583019058న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ చుట్టూ ఎన్ని విజయాలున్నాయో.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రూపం లో అన్ని వివాదాలూ ఉన్నాయి. హైదరాబాదీ ఆటగాడు అజరుద్దీన్‌ జీవిత కథ ఆధారంగా నిర్మించిన ‘అజర్‌’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదల కానుం ది. నటీనటులతో కలిసి అజరుద్దీన్‌ కూడా ప్రమోషన్‌లో పాలుపంచుకుంటున్నాడు. అయితే ప్రచారంలో భాగంగా ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో అజర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై చానెల్‌ ప్రశ్నలు సంధిస్తూ.. డబ్బు తీసుకున్నారా? లేదా? అని సూటిగా అడిగింది. అజర్‌ సమాధానం చెప్పలేక కోపంతో అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్లిపోయాడు. స్టేజ్‌పైకి రావాలని సినిమా యూనిట్‌ కోరినా దూరంగానే ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయని భావించి మరోచోటికి వెళ్లినా కూ డా ప్రమోషన్‌లో పాలుపంచుకోలేదని సినిమా వర్గాలు తెలిపాయి. కాగా అజర్‌ 99 టెస్టుల్లో 6215, 334 వన్డేల్లో 9378 పరుగులు సాధించాడు. 2000లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కారణంగా అజర్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2012లో ఆ నిషేధాన్ని కొట్టివేసింది.