ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన.. నెలాఖరుకు స్వదేశానికి తిరిగి వస్తారు. ఫిబ్రవరి 3న నల్గొండ జిల్లా మిర్యాల గూడ, 4న కరీంనగర్ జిల్లా జగిత్యాల, 5న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో సీఎం రేవంత్ పర్యటిస్తారు.మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 890 మంది అభ్యర్థుల నుంచి 902 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో 382 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 258 మంది బీఆరఎస్ అభ్యర్థులు, 169 మంది భాజపా అభ్యర్థులు ఉన్నారు.