ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమలాపూర్ వంశి

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి అక్టోబర్ 20 జనం సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ 3,500 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని TNSF రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి జామల్ పూర్ వంశీ దేవరకొండ ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ వంశీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సబబు కాదని ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యార్థుల ప్రాణాలను సైతం ఫణం పెట్టి గద్దెనెక్కరాని గుర్తుచేశారు ఈరోజు ఆ విద్యార్థులకు మొండి చేయి చూపిస్తున్న కెసిఆర్ కు తగినగుణపాఠం చెప్తాం అని ఇప్పటికైనా ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయపోతే ప్రగతి భవన్ ను ముట్టడి చేస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో కోతి అమరేందర్ రెడ్డి తెలుగు రైతు రాష్ట ఉపాధ్యక్షుడు ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గార్లపాటి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు, టీ ఎస్ ఎస్ ఎఫ్ నాయకులు యదా రాము,హరీష్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు