బెంగళూరు,జూలై4(జనం సాక్షి): ఫెమినా మిస్ ఇండియా 2022 కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినిశెట్టి దక్కించుకుంది. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీని ముంబైలో నిర్వహించారు. ఫైనల్స్ లో మిస్ ఇండియా 2022 విజేతగా సినిశెట్టిని ప్రకటించారు నిర్వాహకులు. అలాగే రాజస్థాన్ కు చెందిన రూబల్ షెకావత్ రెండో రన్నరప్ గా నిలిచారు. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి చేతుల విూదుగా సినీ శెట్టి కిరీటాన్ని అందుకున్నారు. సినీ శెట్టి కర్ణాటకలో డిగ్రీ పూర్తి చేసింది. రానున్న రోజుల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ వరల్డ్ పోటీలో పాల్గోనున్నారు.