ఫేస్‌బుక్‌లో థాకరేపై వ్యాఖ్య : ఇద్దరు అమ్మాయిల అరెస్ట్‌

ముంబయి : శివసేన అధినేత బాల్‌థాకలే మృతి తర్వాత ముంబయి బంద్‌పైన ఫేస్‌ బుక్‌లో ఇద్దరు అమ్మాయిలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వారి అరెస్టుకు దారి తీసింది. బాల్‌ థాకరే మృతి సందర్బంగా అదివారం ముంబయిలో బంద్‌ పాటించడాన్ని ఫేస్‌బుక్‌లో అఇద్దరు యువతులు ప్రశ్నించారు. వారిపై సేన కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పధ వ్యాఖ్యలు చేసిన అమ్మాయిల్ని పోలీసులు అరెస్టు చేసి అతర్వాత విడుదల చేశారు.

థాకరే వంటి వారు ప్రతి రోజు పుడుతుంటారు… మరణిస్తుంటారు… ఇందుకు బంద్‌ పాటించాల్సిన అవసరమేముందని థానే జిల్లాకు చెందిన ఇరవయ్యొక్క ఏళ్లపహీన్‌ దాఢా ఫేస్‌ బుక్‌లో రాసింది. ఈ వ్యాఖ్యలపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హజరు పర్చారు. కోర్టు వారికి 14 రోజుల జ్యూడిపియల్‌ కస్టడి విధించింది.

అవెంటనే వారికి రూ. 15 వేల పూచీకత్తుపై బెయిల్‌ లభించింది. వీరిపై స్థానిక శివసేన కార్యకర్తలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు యువతులను అరెస్టు చేసిన అధికారులను తక్షణం తోలగించాలని. లేదంటే మీ పైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మహరాష్ట్ర ముఖ్యమంత్రికి భారత ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ కట్టూ లేఖ రాశారు. ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాఢా అంకుల్‌ క్లినిక్‌పై దాడి చేశారు. క్లినిక్‌ పైన దాడి కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు.