ఫైనల్ రౌండ్‌లో జీతూ రాయ్ బోల్తా

రియో ఒలింపిక్స్ లో భారత స్టార్ షూటర్ జీతూరాయ్.. ఫైనల్ రౌండ్ లో బోల్తా పడ్డాడు. పతకం ఆశలతో బరిలోకి దిగిన జీతూ.. అర్హత రౌండ్ లో ఆకట్టుకున్నా.. ఫైనల్ రౌండ్ లో మాత్రం 8వ స్థానానికే పరిమితమయ్యాడు. పది మీటర్ల మెన్స్ ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్ రౌండ్ లో జీతూ రాయ్ 78.7 పాయింట్లు సాధించి ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో మొత్తం 46 మంది పోటీ పడగా.. భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన మరో షూటర్ గురుప్రీత్ సింగ్ 20వ స్థానంలో నిలిచాడు.