ఫోటో రైట్ అప్: బియ్యం సేకరణ ప్రారంభిస్తున్న బెలిదె వెంకన్న
రబీ బాయిల్డ్ బియ్యం సేకరణ ప్రారంభించిన బెలిదె వెంకన్న
స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 24, ( జనం సాక్షి ) : జనగామ జిల్లా పరిధిలో రబీ 2021 – 22 సంవత్సరానికి గాను బాయిల్డ్ బియ్యం సేకరణ కార్యక్రమాన్ని కాజీపేటలోని ఎఫ్ సి ఐ గోదాంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
బెలిదె వెంకన్న ప్రారంభించారు. అదే విధంగా స్టేషన్ ఘన్పూర్ లో గల అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీ స్ లో రబీ 2021- 22 బియ్యం సేకరణ ప్రారంభిం చడం జరుగుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో ఎఫ్సిఐ డిఎం నీరజ్ కుమార్, డిపో మేనేజర్ నర సింహారెడ్డి,ప్రొక్యూరిమెంట్ మేనేజర్ శేశి కుమార్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్న, బెలిదె సతీష్, చకిలం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.