ఫ్యాన్ పార్కులు: కుటుంబంతో కలిసి ఐపీఎల్ 8 మ్యాచ్‌లు ఉచితంగా వీక్షించండి

9mozf8ru
బెంగుళూరు: ఏప్రిల్ 8 నుంచి దేశ వ్యాప్తంగా ఐపీఎల్ సమరం ప్రారంభం కానుంది. స్టేడియాలకు వెళ్లి నేరుగా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించలేని అభిమానుల కోసం బీసీసీఐ సరికొత్త ఉచితంగా మ్యాచ్‌లను వీక్షించే వెసులుబాటును క్రికెట్ అభిమానులకు అందిస్తోంది. మనదేశంలో కొన్ని నగరాలు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వని విషయం తెలిసిందే. ఆయా ప్రధాన నగరాల్లో ఉంటున్న క్రికెట్ అభిమానులకు ఉచితంగా స్టేడియం ఎక్స్‌పీరియన్స్‌ని అందించే భాగంలో ఈ ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఐపీఎల్ ఇది ఇండియా వాళ్ల సంబరం. ఈ సంబరాన్ని క్రికెట్ ప్రేక్షుకలకు మరింతగా చేరువ చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమేనని అన్నారు. పెప్సీ ఐపీఎల్ 2015ను దేశ వ్యాప్తంగా 12 వేదికల్లో నిర్వహించనున్నారు. ఫ్యాన్ పార్కులు: కుటుంబంతో కలిసి ఐపీఎల్ 8 మ్యాచ్‌లు ఉచితంగా వీటితో పాటు మరో 15 నగరాల్లోని పబ్లిక్ ప్లేసులో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వీక్షించేందుకు ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద స్క్రీన్స్‌లో అచ్చం స్టేడియం లాంటి అనుభూతినే ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఫ్యాన్ పార్కుల్లో సుమారు 10,000 మంది వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలు, మహిళలకు ప్రత్యేకంగా స్పెషల్ ఏరియాలను కూడా కేటాయించనున్నారు. స్టేడియంలో మాదిరే మ్యూజిక్, పుట్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంఛైజీలే ఈ బాధ్యతను తీసుకుంటాయని తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి సుమారు 2 లేదా 4 గంటల ముందే ఈ ఫ్యాన్ పార్కుల్లో వెళ్లేందుకు అనుమతిస్తారు. ఫ్యాన్ పార్కులు కలిగి ఉండే నగరాలు: ఆగ్రా, నాగ్పూర్, కోయంబత్తూర్, లుధియానా, గుంటూరు, సూరత్, వరంగల్, ఉదయపూర్, బెలగావి, కాన్పూర్, ఇండోర్, అలహాబాద్, భూపాల్. మరో రెండు నగరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ నగరాల్లో ఏ ప్లేసులో పెప్సీ ఐపీఎల్ ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేస్తారో త్వరలో బీసీసీఐ ప్రకటిస్తుంది.