ఫ్యూచర్‌సిటీ వరకు మెట్రోరైలు విస్తరించాలి
` ఇందుకు అనుగుణంగా డిపిఆర్ సిద్ధం చేయాలి
` భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ఆర్‌ఆర్‌ఆర్ సమీపంలో డ్రైపోర్ట్ నిర్మాణానికి రూపకల్పన
` హైదరాబాద్ ` మంచిర్యాల కొత్త జాతీయ రహదారికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలి
` ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు రేడియల్‌రోడ్లు అలాగే ఆర్‌ఆర్‌ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు రహదారుల విస్తరణపైనా ప్రత్యేక దృష్టి
` ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్(జనంసాక్షి): రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే దీనిపై గతంలో ఇచ్చిన సూచనల ఆధారంగా త్వరగా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ సవిూపంలోనే భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా డ్రైపోర్ట్ నిర్మాణానికి రూపకల్పన చేయాలని సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్, జాతీయ రహదారులపై సీఎం సవిూక్ష నిర్వహించారు.ప్రత్యేకించి రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవిూక్షించారు. ఇటీవల రాష్ట్ర పునర్విభజన అంశాలపై ఢల్లీిలో జరిగిన తెలంగాణ, ఏపీ అధికారుల సమావేశంలో హైదరాబాద్ – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమోదం తెలపాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆదేశించిన నేపథ్యంలో ఆ పనులపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపైనా సవిూక్షించిన సీఎం.. ఫ్యూచర్ సిటీ- వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు- చెప్పారు. ఇందుకోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మెట్రో రెండో దశ ప్రతిపాదనలు, కేంద్రం అనుమతులపైనా సవిూక్షించిన సీఎం.. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు.రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని, దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ నివేదికను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ రహదారికి ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు పంపించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. పలు చోట్ల పంటలు ఉన్నాయని, పంట నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. పంట కాలం దాదాపు పూర్తవుతున్నందున ఆ వెంటనే రైతులతో మాట్లాడి భూ సేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. భూ సేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడాలని, సాంకేతిక, న్యాయ సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సూచించారు.ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు రేడియల్ రోడ్లు, ఆర్‌ఆర్‌ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న రహదారుల విస్తరణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు సవిూక్షలో పాల్గొన్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ పనుల్లో వేగం పెంచండి
బాపూఘాట్‌లో గాంధీ సరోవర్ నిర్మాణం
విూరాలం ట్యాంక్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులు
అధికారులతో సవిూక్షించిన సిఎం రేవంత్
హైదరాబాద్ (జనంసాక్షి):మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాపూఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్‌తో పాటు విూర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు. విూర్ అలం ట్యాంక్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్తో పాటు- మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విూర్ అలం ట్యాంక్ పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. రెండున్నర కిలోవిూటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యముండే డిజైన్లను ఎంచుకోవాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఈ బ్రిడ్జితో పాటు విూర్ ఆలం ట్యాంక్‌లో వివిధ చోట్ల ఐలాండ్లా ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. సింగపూర్ లోని గార్డెన్స్ బై ది బే ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వెడ్డింగ్ డెస్టినేషన్ కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు- అడ్వంచర్ పార్క్, ధీమ్ పార్క్, అంఫీ థియేటర్ను ఏర్పాటు- చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలన్నారు. బోటింగ్ తో పాటు- పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటు-లో ఉండాలని సూచించారు. ట్యాంక్ లో నీటిని శుద్ధి చేయటంతో పాటు- ఐలాండ్ ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలని చెప్పారు. పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. విూర్ అలం ట్యాంక్లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీ తో పాటు- పర్యావరణానికి సంబంధించి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించాలని, ఆ నివేదికల ఆధారంగా అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విూర్ అలం బ్రిడ్జితో పాటు- ఈ ఐలాండ్ జోన్ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలని సూచించారు. ఇక్కడి డెవెలప్మెంట్ ప్లాన్‌ను దృష్టిలో పెట్టు-కొని జూ పార్కును అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్ గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పర్యాటకులను మరింత ఆకట్టు-కునేలా అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు.
ఐమాక్స్ సమీపంలో ఫూలే విగ్రహ ఏర్పాటుపై ఆలోచన
` స్థలాన్ని పరిశీలించిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఉన్న సచివాయ సవిూపంలో ఫూలే విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సవిూపంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎంతో పాటు- స్థల పరిశీలనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు. ఇక్కడ ఉన్న స్థలంలో విగ్రహ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సిఎం సూచించారు. స్థలం సర్వే చేసి పూర్తి స్థాయి ప్రణాళికలతో నివేదికను అందించాలని అధికారులను సిఎం ఆదేశించారు. అలాగే భవిష్యత్ లో ట్రాఫిక్ తదితర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ చేయాలని అధికారులకు సూచించారు.