ఫ్రీడమ్ రన్ లో పాల్గొని దేశభక్తిని చాటుదాం : సిఐ ముత్యం రమేష్
పినపాక నియోజకవర్గం ఆగష్టు 10 (జనం సాక్షి):స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రేపు గురువారం ఉదయం 06:00 గంటలకు మణుగూరు పోలీస్ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించే 2.5 కె ఫ్రీడమ్ రన్ ను విజయవంతం చేసి దేశభక్తి ని చాటుకోవాలని సిఐ ముత్యం రమేష్
పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని కిన్నెర కళ్యాణ్ మండపం నుంచి 2.5 కిలోమీటర్ల మేర నిర్వహించే ఫ్రీడం రన్ లో అన్ని వర్గాల ప్రజలు ,యూనియన్ నాయకులు, విద్యాసంస్థలు, లారీ అసోసియేషన్స్, ఆటో యూనియన్, వైద్యులు, లాయర్లు , మండల ప్రజలు , యువకులు , ప్రజాప్రతినిదులు , ఇతర శాఖ అధికారులు, మీడియా సోదరులు తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని జాతీయ భావాన్ని చాటి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.