ఫ్లోరోసిస్ నియంత్రణలో అధికారులు సమన్వయంతో పని చేయాలి…
– మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలి.
– శుద్ధమైన నీటిని ప్రజలకు అందేలా చూడాలి.
– ఫ్లోరోసిస్ కంట్రోల్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రవీందర్, శ్రీధర్.
ఊరుకొండ, ఆగస్టు 19 (జనం సాక్షి):
ఫ్లోరోసిస్ నియంత్రణలో అధికారులు సమన్వయంతో పని చేయాలని.. మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ప్రజలకు శుద్ధమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఫ్లోరోసిస్ కంట్రోల్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రవీందర్, శ్రీధర్, జిల్లా ఫోర్సిస్ కంట్రోల్ అధికారి డాక్టర్ కొమిదిని దేవిలు సూచించారు. శుక్రవారం ఊరుకొండ మండల పరిధిలోని రాచాలపల్లి గ్రామాన్ని రాష్ట్ర ఫ్లోరోసిస్ నియంత్రణ విభాగం మరియు అసంక్రమణ వ్యాధుల నివారణ విభాగం సంయుక్తంగా రాచాలపల్లి గ్రామాన్ని సందర్శించినారు. 2016లో రాచాలపల్లి గ్రామంలో ఫ్లోరోసిస్ బాధితులను గుర్తించిన విషయం పాఠకులకు విదితమే. అప్పటినుండి ఈరోజు వరకు ఫ్లోరో సిస్ బాధితుల స్థితి గతులను వైద్య సదుపాయం మరియు గ్రామంలో మంచినీరు సరఫరా మిషన్ భగీరథ కార్యక్రమాల పని విధానాన్ని పర్యవేక్షించినారు. మిషన్ భగీరథ పనులు పూర్తిచేసి నీరు కలుషితం కాకుండా చూడాల్సిన సంబంధిత శాఖ అధికారులపై ఉందని గుర్తు చేశారు. శుద్ధ జలాల ద్వారానే ఫ్లోరోసిస్ నివారణ సాధ్యమవుతుందని వారు అన్నారు. కార్యక్రమంలో ఫోర్సిస్ కంట్రోల్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రవీందర్, శ్రీధర్, జిల్లా ఫోర్సిస్ కంట్రోల్ అధికారి డాక్టర్ కొమిదిని దేవి, మరియు ఇన్చార్జ్ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక రాణి, మిషన్ భగీరథ ఇంజనీర్ నాగమణి, ఊరుకొండ వైద్య సిబ్బంది దార ప్రసాద్, శోభారాణి, వరలక్ష్మి, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
19యుకే01, రాచాలపల్లి గ్రామంలో ఫ్లోరోసిస్ బాధితులతో మాట్లాడుతున్న అధికారులు.
19యుకే02, మిషన్ భగీరథ వాటర్ సరఫరాను పరిశీలిస్తున్న అధికారులు.