బంగ్లాదేశ్ టార్గెట్ 303 రన్స్

bfoifg5iబంగ్లాదేశ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ పోరులో టీమిండియా అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీసేన 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ టోర్నీలో తొలి సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలో తడబడ్డ భారత్ తర్వాత రోహిత్, రైనా సూపర్ బ్యాటింగ్ తో పుంజుకుంది. ఓపెనర్లు ధావన్, రోహిత్ తొలి వికెట్ కు 75 రన్స్ జోడించి గట్టి పునాది వేశారు. 30 పరుగులు చేసిన ధావన్ ఔటయ్యాక భారత్ తడబడింది. కోహ్లి 3, రహానే 19 రన్స్ చేసి వెంట వెంటనే ఔట్ అయ్యారు. 115 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆత్మ రక్షణలో పడ్డ టీమిండియాను రోహిత్, రైనా నిలబెట్టారు. బ్యాటింగ్ పవర్ ప్లేలో ధాటిగా ఆడిన రోహిత్ 126 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 137 రన్స్ చేసి ఔటయ్యాడు. అటు మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన రైనా 57 బంతుల్లో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో జడేజా మెరుపుబ్యాటింగ్ చేయడంతో టీమిండియా 300 పరుగుల మార్క్ ను దాటింది.