బంచరాతండలో సర్పంచ్ శరత్ నాయక్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీగా బతుకమ్మ పండుగ
ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలు
-సర్పంచ్ లూనావత్ శరత్ నాయక్

కురవి సెప్టెంబర్-28 (జనం సాక్షి న్యూస్)

కురవి మండల కేంద్రంలోని బంచరాయితండ గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ లూనావత్ శరత్ నాయక్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా సీఎం కేసీఆర్ చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. తెలంగాణ ఆడపడుచులకు అన్నలాంటి కెసిఆర్ కు అండగా ఉండాలని ఆయన కోరారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు కానుక అందించడంతో పాటు చేనేత కార్మికులకు ఉపాధి చుపాలన సంకల్పంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ సంకల్పం చేశారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో నిరుపేద మహిళలు సైతం బతుకమ్మ పండుగకు కొత్త చీరలు కట్టుకొని మురిసిపోతారని అన్నారు. పూలనే దేవతగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరి ఎక్కడ లేదని సర్పంచ్ రత్నక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బంచరాతండ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవి, డీలర్ జలీల్, పప్పీ, సక్మీ, మారోని, బద్రి, సేవూరి, శాంతి, కల్కి, మీరీ, బద్రి, తదితరులు పాల్గొన్నారు.