బండి సంజయ్ అరెస్టుకు నిరసన గా భాజాపా ఆందోళన

నిర్మల్ బ్యూరో, ఆగస్టు23,జనంసాక్షి,, భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా భాజాపా శ్రేణులు ఆందోళన చేపట్టేందుకు పార్టీ కార్యాలయంలో కి చేరుకోగానే  పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పార్టీ నాయకులకు,పోలీసులకు తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. బీజేపీ నేతలు రావుల రాంనాధ్, అయ్యన్నగారి భూమయ్య, డా,,మల్లికార్జున రెడ్డి, శ్రావణ్ రెడ్డి, తదితరులను పట్టణ సి ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని నాయకులను పోలీసుల వాహనాల్లో ఎక్కించేందుకు ప్రయత్నించగా నేతలు అక్కడే బైఠాయించారు. ఈసందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద చేరుకొని నాయకుల కు మద్దతుగా నినాదాలు చేశారు. బిజెవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ ఆమె చిత్ర పాఠాన్ని కాలబెట్టేందుకు ప్రయత్నించారు.పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం నికి వత్తాసు పలుకుతూ టీఆరెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే బీజేపీ నాయకుల ను గుండాలతో, సమానంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మరికొద్ది రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాడుతుందని మేము అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి చూస్తామని అన్నారు, ఈకార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు