బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పాతబస్టాండ్‌లోని ఓ వస్త్ర దుకాణంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోషన్ సెలక్షన్స్ వస్త్ర దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో రూ.30 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లనట్లు అంచనా వేస్తున్నారు.