బడుగుల బతుకులుపై బుల్డోజర్లు
విద్వేష విషం నింపుకున్న పాలకులు
పేదరికాన్ని నిర్మూలించ లేని రాజ్యం
పేదల్ని నిర్మూలించే పనిలో సర్కారు
న్యూఢల్లీి,ఏప్రిల్ 24(జనంసాక్షి):దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో దృష్టిసారించాల్సిన కేనీద్రంలో అధికారంలో ఉన్న బిజేపి నేతృత్వంలోని ప్రభుత్వం విద్వేష రాజకీయాల విూద పునాథులు వేసుకుంటుందా. అన్న ప్రశ్నకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెపుతున్నట్లు అన్పిస్తుంది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్ధకం చేస్తు ఇటీవల దేశ రాజధాని ఢల్లీి జహంగీర్‌పురలో జరిగి న కూల్చివేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి భారతీయ జనతా పార్టీ ఎజెండాను ఏమైనా తెరపైకి తెచ్చిందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఢల్లీిలో సరిగ్గా మూడువందల 71 అనధికారిక కాలనీలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాలనీల పరిధిలో 50 లక్షలకు పైగా నిరుపేదలు జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తుంది. సరిగ్గా కూల్చివేతలకు జహంగీర్ పురలోని ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్లు స ఎష్టంగా తెలుస్తుంది. పైకి ఎలాంటి మత రాజకీయాలు లేవంటూ సెలవిస్తున్న జరిగిన పరిణామాలు మాత్రం మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నట్టు స్పష్టం అవుతుంది. అధికారులు నిర్దేశించిన సమయం ప్రకారం కూల్చివే తలు ప్రారంభించాల్సి ఉండగా ముందస్తుగానే ఉదయం 9 గంటలకే కూల్చివేతలు ప్రారంభించడాన్ని భాధితుల తరపున న్యాయవాది దుష్యంత్ దవే ఉదయం కోర్టు ప్రారంభమైన 10.30 గంటలకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తామనే ఉద్దేశ్యంతోనే కూల్చివేతలను కొనసాగించారని కోర్టు దృష్టికి తీసుకురావడం గమనంలోకి తీసుకుంటే ఉద్దే శ్యపూర్వకంగానే కూల్చివేతలు కొనసాగాయని అర్ధమవుతుంది. యదాతదా స్థితిని కొనసాగించాలంటూ కోర్టు తెలిపినా కోర్టు ఆర్డర్ కాపీలు అందించినా కూల్చివేతలు కొనసాగిన పరస్థితి..ఈ విషయంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో చలనం లేకుండా పోవడం గమనార్హం. అధికారుల వాదన మరీ చిత్రంగా కనిపి స్తుంది. రొటీన్ గా కూల్చివేతలు జరుగుతాయంటూ చేతులు దులిపేసుకోవడం వెనుక భారతీయ జనతా పార్టీ అ ధికారులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యం వ్యవస్థను పటిష్టంగా కాపాడ వలసిన బాధ్యతలు భుజాన వేసుకున్న పాలకులే బేఖాతరుగా ప్రజాస్వామ్యాన్ని బుల్ డోజర్లతో కూల్చివేస్తున్న పరి స్థితి. చిన్నచిన్న చిరువ్యాపారాలు చేసుకుంటున్న నిరుపేదలను మతం రంగు పులిమి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు జహంగీర్ పూర్ ప్రాంతంలో కూల్చివేతలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ ఘటన పై తీవ్రంగానే స్పందించాయి. భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేతలకు పాల్పడిరదని ఆరోపిం చాయి. ఆరోపణల విషయం అలా పక్కన పెడితే కూలిపోయిన నిరుపేదల బతుకులు మాత్రం ప్రశ్నార్ధకంగానే మిగిలాయి.