బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్
విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలో విగ్రహం ఏర్పాటు
విజయనగరం,ఆగస్ట్4(జనం సాక్షి ): బడుగు, బలహీన వర్గాలకే కాకుండా యావత్ సమాజనికి అంబేద్కర్ ఆదర్శనీయుడని విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్ తెలిపారు. శనివారం విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పి పాల్ రాజ్, ఓఎసీ వీక్రంత్ పాటిల్ పలువులు అధికారులతో కలిసి డిఐజి అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేడు బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించబడ్డాయని, ఆ ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని తెలిపారు. ఇప్పటికీ ఆయన రాసిన రాజ్యాంగం విలువ ఏ మాత్రం తగ్గలేదన్నారు. అనంతరం కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ.. తనలాంటి ఎందరో బలహీన వర్గాలకు అంబేద్కర్ దేవుడని, ఈ ఉన్నత స్థానంలో ఉండడానికి ఆయనే కారణమని తెలిపారు. అనంతరం ఎస్పి పాల్ రాజ్ మాట్లాడుతూ.. ఎక్కడైనా నిలుచుని ఒక్క చేతిలో రాజ్యాంగం పట్టుకున్నట్టు ఉన్న అంబేద్కర్ విగ్రహం ఉంటుందని, ఇక్కడ కూర్చుని వున్న ఆయన విగ్రహం పెట్టడం చాలా
అభినందనీయమన్నారు. ఇలాంటి విగ్రహం పెట్టిన పిటిసి ప్రిన్సిపల్ రజశికమనిని ప్రత్యేకంగా అభిందస్తున్నామని తెలిపారు. ఓఎస్డీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఒక్క పుస్తకమని వర్ణించారు. ఆయన జీవితంలో సగం పైగా వయస్సు పుస్తకాలతోనే గడిపారని, అలాంటి మహానుభావుడు ఇండియాలో పుట్టడం మన అదృష్టం అన్నారు. పిటిసి ప్రిన్సిపల్ రాజశికమని మాట్లాడుతూ.. ఈ విగ్రహం ఏర్పాటులో ఎందరో కృషి చేశారని, వారందరినీ ప్రత్యేకంగా అభినందించారు. త్వరలోనే సర్ధర్ వల్లభారు పటేల్ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం అందరినీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టిఒ ఉపకమిషనర్ కృష్ణవేణి , డిఎస్‌పిలు, సిఐ లు, ఎస్‌ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.