బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతసవిూక్ష
` రూ.3లక్షల కోట్ల రాష్ట్రబడ్జెట్!
` బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
` రూ.37,000కోట్లు కేటాయించే అవకాశం
` కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లతో బడ్జెట్ లో రూపకల్పన
` మంత్రి హరీశ్‌రావు, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023`24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2023`24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి మొదటివారంలో ప్రవేశపెడుతుంటారు. అయితే సీఎం కేసీఆర్ కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత వేగం మరింత పెరిగింది. ముఖ్యంగా ఖమ్మం సభతో దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మూడు రాష్ట్రాల సీఎంలు, ఇద్దరు జాతీయ పార్టీల కీలక నేతలు హాజరుకావడంతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి.అనేక రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో మరింత వేగం, చొరవ పెరగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకోసం తెలంగాణ బడ్జెట్‌ను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతుంది. ఇందులో రాష్ట్రానికి సంబంధించి తేలాల్సిన లెక్కలు రెండు మాత్రమే ఉంటాయి. ఎఫ్‌ఆర్బీఎం రూపంలో రాష్ట్రానికి వచ్చేది ఎంత? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా (డివొల్యుషన్`స్టేట్స్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్) ఎంత వస్తుంది? అన్న రెండు అంశాలు తెలిస్తే సరిపోతుంది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టగానే రాష్ట్రానికి వచ్చే నిధులపై అధికారులు ఒక అంచనాకు వస్తారు. ఈ మేరకు ఈ వారంలో కసరత్తు పూర్తి చేసి, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన కొద్దిరోజుల్లోనే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.2022`23లో ప్రభుత్వ వ్యయం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు దాటినట్టు అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మిగిలి ఉన్నాయి. అవి కూడా కలుపుకొంటే రూ.2.10 లక్షల కోట్ల నుంచి రూ.2.15 లక్షల కోట్ల వరకు లెక్క తేలుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర సొంత ఆదాయ (స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ) వృద్ధిలో తెలంగాణ దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించినట్టు సమాచారం. రాష్ట్ర సొంత ఆదాయం (ఎస్‌వోఆర్) 19`20 శాతం వృద్ధి నమోదు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.