బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన -ఎమ్మెల్యే రెడ్యానాయక్
కురివి సెప్టెంబర్-24 (జనం సాక్షి న్యూస్)
బతుకమ్మ నేపథ్యంలో పేద,మధ్య తరగతి ఏలాంటి వర్గ బేధాలు లేకుండా మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యా నాయక్ అన్నారు. కురవి గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే చేతుల మీదుగా టిఆర్ఎస్ నాయకులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందని, దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని,వీటిని అడ్డుకోవడానికి బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ పద్మావతి,వైస్ ఎంపీపీ నరసయ్య, మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉమా పిచ్చిరెడ్డి,సర్పంచ్ నూతక్కి పద్మ నర్సింహా రావు, తాసిల్దార్ ఇమ్మానుయేల్, ఎంపీడీఓ సరస్వతి,ఎంపీటీసీ లు భాస్కర్,బొజ్యా నాయక్,రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, జిల్లా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి,సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర యూత్ నాయకులు గుగులోత్ రవి నాయక్,మండల యూత్ అధ్యక్షుడు బానోతు రమేష్, ఆలయ చైర్మన్ రాము నాయక్,మాజీ చైర్మన్ రాజు నాయక్, కార్యదర్శి విజయలక్ష్మి, వార్డు మెంబర్లు, టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు మహిళామణులు తదితరులు పాల్గొన్నారు