*బయ్యారం మండలంలో ఆర్డివో ఆకస్మిక తనిఖీ*

బయ్యారం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆర్డివో అధికారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీ లో భాగంగా కల్యాణలక్ష్మి-షాదీముభారక్ దరఖాస్తులు,వారసత్వ భూముల వివరాలు,పట్టాదారు పాస్ బుక్ వివరాలు, మీసేవ సంబంధిత దరఖాస్తులు, తెలంగాణ క్రీడా మైదానం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వివరాలు, తదితర రెవిన్యూ విషయాలను పర్యవేక్షించారు. ఆ తర్వాత నామాలపాడు సమీపంలోని ధర్మాపురం పర్యటించి ఫారెస్ట్,రెవెన్యూ భూముల వివరములు తనిఖీ చేపట్టారు