బర్మా అధ్యక్షుడు విన్‌మైంట్‌తో ప్రధాని మోడీ భేటీ
ఖాట్మాండు,ఆగస్ట్31(జనం సాక్షి): నేపాల్ రాజధాని ఖాట్మాండులో మయన్మార్ అధ్యక్షుడు విన్‌మైంట్‌ను ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం కలిశారు. ద్వైపాక్షిక సహకార బలోపేతం చేసేమార్గాలపై ఇరువురు దేశాధినేతలు చర్చించారు. ఖాట్మాండులో జరిగే 4వ బెంగాల్ ఇన్సియేటివ్ మల్టి-సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిఐఎంఎస్‌టిఇసి)సమ్మిట్‌కు ప్రధాని హాజరయ్యారు. అభివృద్ధి సహకారం, సామర్థ్యం, ఇతర ప్రాంతాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశాడు. అంతకు ముందు బిఐఎంఎస్‌టిఇసి విచ్చేసిన మోడీతో సహా ఇతర నేతలు అనధికారికంగా కలుసుకున్నారు.’బిఐఎంఎస్‌టిఇసిని బలోపేతం చేయడానికి నేతలతో చర్చలు అద్భుతంగా జరిగాయని’ మోడీ ట్వీట్ చేశారు. ఈ సమ్మిట్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, మయాన్మార్, థారులాండ్, భూటాన్, నేపాల్ /-ఱనేతలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పాటు శ్రీలంక ప్రధాని మైత్రిపలా సిరిసేనాతో ప్రధాని మోడీ గురువారం చర్చలు జరిపారు.