బలపాల గ్రామంలో మన ఊరు-మన బడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని
-జిల్లా కలెక్టర్ శశాంక
కురవి సెప్టెంబర్-29
కురవి మండలంలోని బలపాల గ్రామంలో మన ఊరు-మన బడి, అభివృద్ధి పనులను సమీక్షించడానికి బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ హై స్కూలు, ప్రైమరీ స్కూల్,అంగన్వాడి పాఠశాలలను సందర్శించి పనులను సమీక్షించారు.విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం క్రింద గ్రామంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ శశాంక.అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోటి 56 లక్షలతో మంజూరైన నూతన భవన నిర్మాణానికి స్థలమును పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గోపి తో మాట్లాడి గ్రామ ప్రజలకు అందుబాటు లో ఉంటూ మెరుగైన వైద్యాన్ని అందించాలని,ఆరోగ్య కేంద్రంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ శశాంక అన్నారు.సాధారణ ప్రసవాలు సంఖ్య పెంపొందించే దిశగా పని చేయాలని జిల్లా కలెక్టర్ వైద్యులను ఆదేశించారు.చాలా సంవత్సరాల చరిత్ర ఉన్న హై స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్,ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన అన్నారు. అంగన్వాడి సెంటర్లో కలెక్టర్ కు విద్యార్థులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అంగన్వాడి టీచర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముళ్ళ రమేష్ , పంచాయతీ రాజ్ డిఇ మహేష్,ఎమ్మార్వో ఇమ్మానుయేల్, ఎంపీడీవో సరస్వతి, ఎంపీఓ పద్మ,పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ గోపి,సీడీపీఓ ఎల్లమ్మ,సర్పంచ్ ముండ్ల ప్రమీల,ఎంపీటీసీ పిట్టల రమణ, ఉపేందర్,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నామ సైదులు,మండల పార్టీ ఉపాధ్యక్షులు బత్తుల వెంకన్న,ఉపసర్పంచ్ మొగిలిచర్ల లక్ష్మీనారాయణ,హై స్కూల్ చైర్మన్ ఐతమ్ వెంకటేశ్వర్లు,ప్రైమరీ స్కూల్ చైర్మన్ వంటి సైదులు,కొండమీది మదన్,అంగన్వాడి టీచర్లు,ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.