బల్గేరియా ఎయిర్‌పోర్టులో బస్సు పేల్చివేత

బర్గాన్‌, బల్గేరియా: బల్గేరియాలో ఇజ్రాయెల్‌కు చెందిన పర్యాటకులతో గల ఓ బస్సును ఆత్మాహుతిదళ సభ్యుడొకరు పేల్చివేశాడు. ఈ ఘటనలో ఉగ్రవాది, బసు& డ్రైవర్‌ సహా మొత్తం ఏడుగురు వ్యక్తులు మరణించారు. దాడి బుధవారం రాత్రి బర్గాన్‌ విమానాశ్రయంలో జరిగింది. ఈ మేరకు బల్గేరియా హోం మంత్రి స్వెటన్‌ స్వెటనోవ్‌ వెల్లడించారు. ఈ దాడిలో తమ దేశానికి చెందిన ఐదుగురు పౌరులు మరణించారని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. సంఘటన వెనుక ఇరాన్‌ మద్దతుగల హిజ్బుల్లా ఉగ్రవాదుల హస్తం ఉందని ఆరోపించింది. పేలుడుకు ముందు అక్కడ ఉన్న పలు బస్సుల్లో ఇజ్రాయెల్‌ పర్యాటకులు గల బస్సును ఉగ్రవాది ఎంచుకున్నట్టు వీడియో దృశ్యాలలో కనిపించింది.

తాజావార్తలు