బస్ కారు ఢీకొని నలుగురు మృతిజనం

జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని కంన్సాన్ పల్లి శివారులో నాందేడ్ అఖోల 161 వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి బస్సు కారు ఢీకొని నలుగురు మృతి
నారాయణఖేడ్ కు వెళ్తున్న సూపర్ లగ్జరీ ఆర్టీసి బస్సు ఎదురుగా వచ్చిన మారుతి కారును ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు,ఒక చిన్నారి పాప,మరోకరు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదానికి పొగ మంచు కారణంగా బస్ డ్రైవర్ పూర్తిగా కుడివైపు రాంగ్ రూట్ లో ప్రయనించడంతో ఎదురుగా వచ్చిన కారును ఢీ కొని సుమారు 50 మీటర్ల వరకు ముందుకు దూసుకెల్లడం, రహదారిపై సూచిక బోర్డ్ లు లేకపోవడంతో రహదారిపై అలుముకున్న పొగ మంచే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటిత స్థలాన్ని చేరుకొని మృతుల వివరాలు దిలీప్ వినోద ప్రతిక పాప కాన్సి గా వీరు సుభాష్ నగర్ ఐడిఏ జీడిమెట్ల కు చెందినవారుగా గుర్తించారు.