బహుజన వాదాన్ని తొక్కేందుకు భారీ ప్యాకేజీ..!

జనం సాక్షి , మంథని : మంథని నియోజకవర్గంలో బహుజన వాదాన్ని తొక్కేందుకు రూ. 8 కోట్ల ప్యాకేజీతో కొంతమంది నాయకులు విష ప్రచారాలకు తెర లెపుతున్నారని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు కొండ రవీందర్ ఆరోపించారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో అనేక సార్లు ఒకే వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా వ్యవహరించారని, కేవలం ఒక్కసారి బిసి బిడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికైతే అగ్రవర్ణాల వారు జీర్ణించుకోవడం లేదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్ట మధుకర్ పై తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. మళ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అదే పద్ధతిని పాటిస్తున్నారన్నారు. కొంతమంది నాయకులకు భారీ ప్యాకేజీ ఇచ్చి పుట్ట మధుకర్ పై తప్పుడు ప్రచారాలకు తెర లెపుతున్నారన్నారు. బీసీలను రాజకీయంగా ఎదుగునీయకుండా కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని స్వయంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారన్నారు. మంథనిలో సైతం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బహుజనవాదం బలపడకుండా చేస్తున్నారన్నారు. ప్యాకేజీకి అమ్ముడుపోయిన నాయకులు చెప్పే మాటలను ప్రజలు ఎవరు నమ్మ వద్దన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై బహుజన వాదానికి చట్టం కట్టాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ యూత్‌ అధ్యక్షుడు కొట్టే రమేష్‌, మండల జనరల్‌ సెక్రటరీ ఒన్నం అశోక్‌, మండల కార్యదర్శి కారెంగుల సురేష్, నాయకులు బడికెల సతీష్, బుక్క రమేష్‌ ఎండీ. వలీలు పాల్గొన్నారు.