బాధితుల తరఫున వైస్ ఎంపీపీ…బాధితుల తరఫున వైస్ ఎంపీపీ…
డోర్నకల్ ప్రతినిధి మార్చి 21 (జనం సాక్షి)
ఇటీవల కురిసిన అకాల వర్షాల దాటికి పంట నష్టపోయిన రైతులను గుర్తించి తక్షణమే ప్రభుత్వం తరఫున నష్టం వాటిల్లిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్ శశాంకను వైస్ ఎంపీపీ దేవేందర్ కోరారు.మంగళవారం జిల్లా కలెక్టర్ శశాంక అకాల వర్షంతో నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ క్రమంలో వైస్ ఎంపీపీ దేవేందర్ కలెక్టర్ ను కలిసి రైతుల బాధలను వివరించారు. కొన్నిచోట్ల అవడగండ్ల వానలు కురిసి నివాస గృహాలు సైతం దెబ్బతిన్నాయని వివిధ పంటలు సాగుచేసిన రైతులను సర్వే ద్వారా గుర్తించి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.ఆయన వెంట ప్రభుత్వ అధికారులు పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు రైతులు తదితరులు ఉన్నారు.