బాధిత కుటుంబాలను పరామర్శించిన మాధవి రెడ్డి.

 

 

 

 

 

 

ఖమ్మం తిరుమలాయపాలెం (డిసెంబర్14) జనం సాక్షి.మండల పరిధిలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను   కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకురాలు  రామ సహాయం మాధవి రెడ్డి  పరామర్శించి కుటుంబ సభ్యుల ఓదార్చారు. తొలత జల్లెపల్లి గ్రామానికి చెందిన దువ్వ రమేష్, రేణుక, భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అదే గ్రామానికి చెందిన తురక వెంకన్న,  ప్రమాదంలో మృతి చెందగా వారి వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి  కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యం కల్పించి. జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిప్పారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పిడమర్తి సుందర్రావు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. అనంతరం పిండిప్రోలు గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు పప్పుల భద్రయ్య, ఇటీవల కాలంలో నూర్చందగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధయం కల్పించారు. ఆమె వెంట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యులు వెంకటరత్నం జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నీరుడు లాజరస్ ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సయ్యద్ మదర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేఖ ,ముత్తయ్య తేజవతు ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.