బాపు పుట్టిన రోజే పోలీసుల కీచక పర్వం

ఆదిలాబాద్‌: ”అర్థరాత్రి స్త్రీ ఒంటరిగా తిరిగిన నాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు ” అని చెప్పిన గాంథీజీ పుట్టిన రోజే పోలీసుల ఓ వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు… బెల్లంపల్లిలోని రడగంబాల బస్తీలో పోలీసులు దారుణానికి ఒడిగట్టారు. ఇద్దురు ఏఆర్‌ కానిస్టేబుల్‌ బస్తీకి చెందిన మహిళపై బలాత్కర ప్రయత్నం చేశారు. ఆ మహిళ ప్రతిఘటించి కేకేలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు గుమికూడి పోలీసు కీచకులకు చెప్పులతో దేహశుద్ధి చేశారు. వారికి చెందిన లాఠీలను, బైకును స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బాధిత మహిళ స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేసింది.