బాబుకందిన నోటీసులతో..  బీజేపీకి సంబంధం లేదు


– ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్నే అడగాలి
– ఏం జరిగిన కేంద్రానికి ఆపాదించడం టీడీపీకి అలవాటుగా మారింది
– పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ .. తామే పూర్తిచేస్తాం
– బీజేపీ నేత పురంధేశ్వరి
విజయవాడ, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : చంద్రబాబుకు పంపిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత పురంధేశ్వరి స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 2010 నాటి కేసుకు సంబంధించి బీజేపీపై ఎలా నిందలు వేస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్నే అడగాలన్నారు. ఏంజరిగినా టీడీపీ నేతలు.. కేంద్రానికి ఆపాదిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని.. తామే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీకి నిధుల కేటాయింపులో అన్యాయం జరగడం లేదని, అయితే సాంకేతిక అంశాలతో కొంత జాప్యం జరిగి ఉండవచ్చునని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఆపరేషన్‌ గరుడ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అసలు ఆపరేషన్‌ గరుడ అంటే టీడీపీ నేతలు చెప్పాలన్నారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేవలం రాజకీయాల్లో లబ్ధికోసమే టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై కాలుదవ్వుతోందని అన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, ఎవరు ఎవరిపై ఆరోపణలు, అసత్యాలు ప్రచారం చేసేది చూస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం ఏపీ ప్రజలే చెబుతారని పురందేశ్వరి హెచ్చరించారు.

తాజావార్తలు