బాబుకు తెలంగాణ సెగ
వరంగల్ : జిల్లాలో వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబునాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పరకాల మండలం లక్ష్మీపురంలో చంద్రబాబు పాదయాత్రను మహిళలు అడ్డుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో మహిళలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.