బాబుతో అవిూతువిూకే బిజెపి సిద్దం


మూడు రాష్ట్రాల ఫలితాలతో తేలనున్న బిజెపి భవితవ్యం
అమరావతి,నవబంర్‌28(జనంసాక్షి): చంద్రబాబుతో అవిూతువిూకే సిద్దపడ్డ బిజెపి అక్కడ విభజన రాజకీయాలకు పెద్దపీట వేస్తోంది. ఓ వైపు పవన్‌, మరోవైపు జగన్‌లను ఎగదోస్తున్న తీరు ఆధునిక రాజకీయాల్లో బిజెపి తీరు బట్టబయలు చేస్తోది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దూరం చేసుకోవడం అన్నది వారి వ్యూహంలో భాగంగానే ఇప్పుడు సుస్పష్టంగా తెలుసింది. నరేంద్ర మోదీ చేసిన పొరపాటు రాజకీయం అని టిడిపి సానుభూతిపరులు అనుకుంటున్నా బిజెపి రాజకీయాలు ఇలాగే ఉంటాయనడానికి ఎపి ప్రయోగం క్షేత్రంగా చూడాలి.  జాతీయ రాజకీయాలలో చంద్రబాబు తనకు ఉన్న పాత పరిచయాలతో ఇక మోడీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేయక తప్పడం లేదు. కాంగ్రెస్‌ తరఫున వకాల్తా పుచ్చుకుని మిగతా పార్టీలన్నింటినీ కాంగ్రెస్‌తో జట్టు కట్టేలా చంద్రబాబు తన పాత పరిచయాలను ఉపయోగించుకుని ముందుకు సాగుతున్నారు.  అప్పటివరకు కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి అంతగా సుముఖత చూపని కొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలలో కలిసి పోటీ చేయడానికి అంగీకరించాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్‌ఇనకల ఫలితాలు ఓ రకంగా బిజెపి ప్రతిష్టకు కూడా సవాల్‌ కానున్నాయి. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేయడంలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల ప్రభావం రేపటి ఎన్నికల ఫలితాలను బట్టి కూడా ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లపై ఎంతో కొంత ఉంటుందన్న ధీమాలో కాంగ్రెస్‌ కూడా ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ విజయావకాశాలు మెరుగుపడ్డాయని సర్వేలు చెబుతున్నాయి.  అత్యంత బలవంతులుగా ఉంటూ వచ్చిన ప్రధాని మోదీ వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలతో ప్రస్తుతం గడ్డు పరిస్థితి
ఎదుర్కోబోతున్నారు. మూడడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారయితే మోడీ నాయకత్వాన్ని బిజెపి నేతలు కూడా సవాల్‌ చేస్తారు.  ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ప్రధాని మోదీ ఎటువంటి వ్యూహాన్ని అమలుచేస్తారన్నద ఇకూడా ప్రధానం కానుంది. ఇకపతోఏ బాబు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేయడానికి మాయావతి అంగీకరించారు. ఈ రెండు నిర్ణయాలు అమలు జరిగితే వచ్చే ఎన్నికల తరవాత నరేంద్ర మోదీ అధికారం నుంచి దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. మోదీ,షా ద్వయం అనుసరిస్తున్న విధానాలు ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని సవాల్‌ చేసేవిగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులందరిలోనూ ఈ భయం ఉంది. దీనికి రేపటి ఎన్నికల ఫలితాలు సమాధానం ఇవ్వబోతున్నాయి.