బాబుది పాదయాత్ర కాదు దండయాత్ర !

స్పష్టత ఇవ్వకుండా వచ్చే బాబును అడ్డుకోండి : కోదండరామ్‌
రాజోలులో టెన్షన్‌..టెన్షన్‌..
దీటుగా అడ్డుకుంటామన్న టీడీపీ వ్యాఖ్యలపై మండిపడుతున్న తెలంగాణవాదులు
హైద్రాబాద్‌, అక్టోబర్‌21(జనంసాక్షి):
వస్తున్నా..మీకోసం అంటూ బాబు తెలంగాణ గడ్డపై చేసేది పాదయాత్ర కాదని అది యావత్‌ తెలంగాణపై దండయాత్ర అని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు..తెలంగాణ కోసం 800 మంది విద్యార్థులు ఆత్మత్యాగం చేసుకొన్నా పట్టించుకోని బాబుకు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై స్పష్టత ఇటవ్వకుండా వచ్చే బాబును ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు..ఆయనను తెలంగాణలో అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని, ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని ప్రజలను కోరారు..తెలంగాణ ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా, తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పర్యటించే హక్కు బాబుకు లేదని ఆయన మండిపడ్డరు..తెలంగాణ ప్రజల మనోభావాలను ఆయన గౌరవించాలని లేకుంటే టీడీపీ పుట్టగతులుండవని ఆయన స్పష్టం చేశారు… మొదటి నుంచి బాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే తెలంగాణలో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు..అయితే బాబును అడ్డుకోవాలన్న టీజేఏసీ పిలుపుపట్ల టీడీపీ నాయకులు స్పందించారు..వారిని నిరసనలను దీటుగా ఎదుర్కొంటామని తమ ప్రజా వ్యతిరేక భావననను భయట పెట్టుకొన్నారు..దీంతో తమది దండయాత్రేనన్న విషయాన్ని వారే బయటపెట్టుకొన్నట్లైంది..అయితే దీనిపై తెలంగాణవాదులు మండ ిపడుతున్నారు..చంద్రబాబును అడ్డుకొన్న వారిని దీటుగా ఎదుర్కొం టామంటే అర్థం ఏంటని మండిపడుతున్నారు..తమపై దాడులు చేయిస్తారా అంటూ ప్రశ్నించారు..తెలంగాణపై వైఖరి స్పష్టం చేయాలంటే దాడులు చేస్తామనడం మంచిది కాదని తెలంగాణ వాదులు మండిపడుతున్నరు..ఎన్ని అవాంతరాలు ఎదురైనా బాబును అడ్డుకునుడేనని స్పష్టంచేశారు..బాబు పర్యటనపై రాజోలిలో టెన్షన్‌ టెన్షన్‌ నెలకొంది..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.