బాబుల్‌ గూడలో గిరిజన రైతు మృతి

బాబుల్‌ గూడలో గిరిజన రైతు మృతి

జైనూరు,(జనంసాక్షి) మండలంలోని గూడమామడ గ్రామపంచాయతీ పరిధిలోని బాబుల్‌ గూడ గ్రామానికి చెందిన ఆత్రం జంగు (48) గిరిజన రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు పోలీసులు కధనం ప్రకారం దీపావళి పండుగకు ముందు సోమవారం చేనులో కంది పంటకు పురుగుల మందు పిచికారి చేసి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్రామస్థులు  హుటాహుటీన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మృతిచెందినట్లు ఎస్సై జవ్వాజి సురేశ్‌ పేర్కొన్నారు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.