బాబు మాత్రమే సిఎం పదవికి అర్హుడా?
బాబు లేకుంటే అభివృద్ది ఆగిపోతుందా
కాంగ్రస్‌తో పొత్తుకు బాబు తహతహ
టిడిపి కొత్త తరహా ప్రచారం కలసి వచ్చేనా?
అమరావతి,ఆగస్ట్3(జనం సాక్షి): ముఖ్యమంత్రి పదవి తన జన్మహక్కు అనీ తాను మాత్రమే అందుకు అర్హుడినని ఇప్పుడు చంద్రబాబులో నాటుకుపోయింది. జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ అనర్హులని, బిజెపి అసలు రేస్‌లోనే లేదని బాబు భావిస్తున్నారు. వీరంతా తనపై కుట్రలు చేస్తున్నారని విరుచుకు పడుతున్నారు. నిజానికి ప్రజాస్వామ్యంలో ఎవరు సిఎం కావాలో కావద్దో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం తనకు తానుగానే సిఎం తాను తప్ప మరొకరు కారాదని కోరుకుంటున్నారు. ప్రజలకు ఇదే సూచన చేస్తున్నారు. అభివృద్ది ఆగిపోతందని హెచ్చరిస్తున్నారు. ఎపిలో సవిూకరణాలు మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పొత్తు కోసం తహతహలాడుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తుననాయి. కేంద్ర ప్రబుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆయన అందుకు వేదికగా చేసుకున్నారని అంటున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం విఫలం అయిందని, అందుకే విపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఎపిలో జగన్, పవన్ కళ్యాణల్‌లు బిజెపికి అనుకూలంగా ఉన్నారని బాబే స్వయంగా అంటున్నారు. టిడిపి నేతలు కూడా ఇది కరెక్టేనని అంటున్నారు. బిజెపితో తెగదెంపులు చేసుకున్నాక జాతీయరాజకీయలపై దృష్టి పెట్టిన బాబు అవిశ్వాస తీర్మానం సపందర్భంగా కాంగ్రెస్ పార్టీని అనూహ్యంగా తనవైపు తిప్పుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, బిజెపిలు టిడిపిని గద్దెనెక్కించాయి. ఇది కాదనలేని సత్యం. ఇప్పుడు వారిద్దరినీ దూరం చేసుకున్న దరిమిలా కాంగ్రెస్ ఓట్లతో మారోమారు బాబు గద్దెనక్కేలా పునాదులు గట్టి చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ గానీ, మరొకరి సహకారం గానీ అవసరం ఏమిటని ఇప్పుడు బాటు అంటున్నారు. మిగతా హీరోలతో
పోల్చితే పవన్‌కు పాపులారిటీ కొంచెం ఎక్కువ. అదే ఇప్పుడు టిడిపికి దెబ్బకాబోతున్నది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పదవి తన భిక్ష అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. సినిమాపరంగా ఉండే పాపులారిటీ గత ఎన్నికలలో ఓట్లు తెచ్చిపెట్టదన్న విషయాన్ని గుర్తించడానికి ఇప్పుడు బాబు కూడా ఇష్టపడడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మిగతా నాయకులతో పోల్చితే పవన్ కల్యాణ్‌కు యువతలో ఆదరణ ఎక్కువగా ఉన్న విషయం వాస్తవం. దీంతో సొంతంగా గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లలో ఎవరో ఒకరికి నష్టం చేసే శక్తి మాత్రం ఆయనకు ఉందని చెప్పవచ్చు. ఇవన్నీ గమనించిన బీజేపీ పెద్దలు పవన్‌ను ఎలాగైనా తమకు అనుకూలంగా తిప్పుకునే స్కెచ్ అమలు చేయబోతున్నారు. ఈ దశలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసినజగన్‌ను ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా తప్పుబట్టారు. జగన్ విమర్శలతో వైసీపీ నాయకులు తలలు పట్టుకున్నారు. నష్టనివారణ ప్రయత్నాలు చేసినా పరిస్థితి చేయి దాటిపోయింది. జగన్మోహన్‌రెడ్డి అలా విమర్శిస్తారని సొంత విూడియా కూడా ఊహించి ఉండదు. పవన్ కల్యాణ్‌కు నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని జగన్ తప్పు చెప్పారు. దీంతో పవన్ ఫ్యాన్స్ జగన్ కుటుంబ సభ్యులను రంగంలోకి తెచ్చి విమర్శలు చేశారు. ఉభయ పక్షాలకూ సోషల్ విూడియా గ్రూపులు ఉన్నందున ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు. మొత్తంగా ఈ వ్వయహారం పవన్‌కు కలసి వచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే జగన్‌కు మాత్రం నష్టం కలిగించిందనే చెప్పాలి. ఇలా జరగడం మంచిదనే అభిప్రాయంలో టిడిపి కూడా ఉంది. ఈ కారణంగానే తనపైనా, తన కుమారుడిపైనా పవన్ ఎన్ని విమర్శలు చేస్తున్నా చంద్రబాబు పెద్దగా స్పందించడం లేదు. భవిష్యత్‌లో ఎన్నికలు జరిగాక అప్పుడు జనసేన, తెలుగుదేశంపార్టీల మధ్య మళ్లీ స్నేహం చిగురించినా ఆశ్చర్య పోవలసింది ఏవిూ లేదు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయాలు, భారతీయ జనతా పార్టీ నాయకుల వ్యాఖ్యల వల్ల ఆ పార్టీ తీవ్రంగా నష్టపోతున్నది. అయితే ఎపిలో మాత్‌ంరం చంద్రబాబుకు వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శిస్తోంది. బాబును ఎండగట్టడంలో ముందుంటోంది. దీంతో బాబు కూడా ఇప్పుడు బిజెపి,జగన్ లక్ష్యంగా విమర్శలకు పదను పెడుతున్నారు. తాను మాత్రమే సిఎంగా ఎపిని అభివృద్ది చేయగలనని అంటున్నారు. మళ్లీ తనకు అధికరాం రాకపోతే అభివృద్ది ఆగిపోంతుందని హెచ్చరిస్తున్నారు.