బాబ్లీ కేసులో చంద్రబాబుకు .. నాన్‌బెయిల్‌బుల్ వారెంట్
– బీజేపీ కుట్రలో భాగమేనంటూ భగ్గుమన్న ఏపీ మంత్రులు
అమరావతి, సెప్టెంబర్14(జనంసాక్షి) : ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంట్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ మెజిస్టేట్ర్ కోర్టు ఇచ్చింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా వారెంట్ జారీపై తెదేపా శ్రేణులు మండిపడ్డుతున్నాయి. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమేనని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
బాబుకు నోటీసులు ‘ఆపరేషన్ గరుడ’లో భాగమే – మంత్రి పుల్లారావు
ముఖ్యమంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం దారుణమని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడుకి ధర్మాబాద్ కోర్టు నోటీసులిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. సినీ హీరో శివాజీ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’లో ఇది ఒక భాగమేనన్నారు. మోడీ, జగన్, కేసీఆర్‌లు కలిసి బాబుపై కుట్ర పన్నారని ఆరోపించారు. సమన్లు జారీ చేయకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం కుట్రలో భాగమేనన్నారు. ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబుకు మాట్లాడే అవకాశం రావడంతో తట్టుకోలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
చిల్లర రాజకీయాలు మానుకోవాలి – మంత్రి ఆనంద్‌బాబు
బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో చరిష్మా ఉన్న ముఖ్యమంత్రిపై కేంద్రం కక్ష కట్టిందన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడే తత్వం తెలుగుజాతికి లేదన్నారు. ఆరోజు కేసులు లేవని
స్పెషల్ ఫ్లయిట్ పెట్టి మమ్మల్ని ఆంధ్రకు తరలించారు.. ఎనిమిదేళ్ళ తర్వాత వారెంట్ ఇస్తారా? అని మండిపడ్డారు. తెలుగుజాతి హక్కు కోసమే ఆనాడు మహారాష్ట్రలో పోరాటం చేసామని ఆయన గుర్తుచేశారు. ఎన్ని బెదిరింపులు చేసినా తెలుగుజాతి వెనక్కు తగ్గదన్నారు. అవినీతి అని బీజేపీ నేతలు దుష్పచ్రారం చేస్తున్నారన్నారు. నాలుగేళ్ళుగా కనపడని అవినీతి నాలుగు నెలల్లో బయటపడిందా అని నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. లేదంటే తెలుగుజాతి దెబ్బ రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మహారాష్ట్రకు 24 గంటలే గడువిస్తున్నాం – మంత్రి చంద్రమోహన్‌రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లో వాపసు తీసుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ ఇవ్వడం కక్షసాధింపు చర్యేనన్నారు. తెలంగాణాలో మహాకూటమికి షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే బాబుకు వారెంట్ ఇచ్చారని అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఎనిమిదేళ్ల క్రితం కేసుకు నోటీసు ఇవ్వడం దారుణమన్నారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే కేసీఆర్ అడ్డుకోలేకపోయారని సోమిరెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీతోపాటు దేశ వ్యాప్తంగా అనేక మంది నేతలకు నోటీసులిస్తున్న మోడీ.. కర్ణాటకలో ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచుతూ దొరికిపోయిన యడ్యూరప్పకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. మరోవైపు బాబుకు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం సాయంత్రం నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు.
బాబు కోర్టుకు హాజరవుతారు – మంత్రి కళా వెంకట్రావు
బాబ్లీ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన కోర్టుకు హాజరవుతారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మంత్రి కళావెంకట్రావు స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం ఆరోజు బాబు పోరాడారని గుర్తుచేశారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు నోటీసులు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారని కళా అన్నారు. చంద్రబాబు ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని ఆయన చెప్పారు. బీజేపీ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈవారెంట్‌లు జారీ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇలాంటి చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు, తెలుగు ప్రజలకు ఉందని, బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఇది కేంద్రం కక్ష సాధింపు చర్యే – మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తే కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి అమరనాథ్ రెడ్డి హెచ్చరించారు. అమరావతిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల కోసం పోరాడిన చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు కుట్ర పన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును బలహీన పర్చేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోందంటూ భాజపా నేతలతో కేంద్ర నాయకత్వం ప్రకటనలు చేయించిందని విమర్శించారు. ఎలాంటి అక్రమాలు లేకపోవడంతో చివరకు తాము అధికారంలో ఉన్న మహరాష్ట్ర ప్రభుత్వం ద్వారా చంద్రబాబుపై
అరెస్ట్ వారెంట్ జారీ చేయించిందని ఆరోపించారు
ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏవిూ చేయలేరు – ఎంపీ కేశినేని నాని
తెలుగు రాష్టాల్ర ప్రజల కోసం పోరాడిన చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం కుట్రలో భాగమేనని విజయవా ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇన్నాళ్లూ అసలు కేసే లేదని చెప్పిన వారు ఇప్పుడు నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన ఆందోళనపై ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు వారెంట్ జారీ చేయడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ఎడారి కాకూడదనే చంద్రబాబు అప్పట్లో ఆందోళన చేశారని నాని తెలిపారు. ఆంధప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నందునే చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. ఈ కుట్రలో ప్రధాని మోదీ, అమిత్ షా, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రధాన సూత్రధారులని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలుగు ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉన్నారని.. ఆయన్ని ఎవరూ ఏవిూ చేయలేదని నాని వ్యాఖ్యానించారు.