బాబ్లీ నిలుపుదల కోసం తెదేపా రాస్తారోకో
రామడుగు: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ రామడుగులో తెదేపా నాయకులు రాస్తారోకో చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు సుధాకర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.