‘బాబ్లీ’ పై తెదేపా రాస్తారోకో
ఎలిగేడు: గోదావరి నదిపై మహరాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు నిరసనగా సోమవారం ఎలిగేడులో తెదేపా నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పై ఆధారపడిన ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారనున్నాయని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండలాధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి, నాయకులు శ్రీనివాస రెడ్డి, కొండయ్య , పరశురాములు, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.