బాబ్లీ వ్యవహారంలో కావాలనే కేసులు

మరోమారు కేంద్రం తీరుపై మండిపడ్డ బాబు

శ్రీకాకుళం,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు మరోమారు మండిపడ్డారు. కేసీఆర్‌కు పరిపక్వత ఉందని, తనకు లేదని, పార్లమెంట్‌లో మోదీ అంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. దేశంలో ఏపీని నెం.1 చేస్తానని సంకల్పం చేశానని చెప్పారు. ఆనాడు బాబ్లీ వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేసి చాలా ఇబ్బందులు పెట్టారని, అప్పుడు కేసులు లేవని చెప్పి.. ఇప్పుడు వారెంట్‌లు పంపించారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే రాజీలేని పోరాటం చేస్తానని ఆయన

స్పష్టం చేశారు. ఏపీ వాసులు దేశ పౌరులా..కాదా అంటూ ప్రశ్నించారు. మనం పన్నులు కట్టడం లేదా.. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. తెలుగుజాతి ఎక్కడ ఉన్నా.. రాష్ట్రం కోసం పోరాడాలని సీఎం పిలుపునిచ్చారు. కేంద్రం సహకరిస్తే మరింత అభివృద్ధి జరిగేదని, కేంద్రం సహకరించకపోయినా 10.5 శాతం గ్రోత్‌ రేటు సాధించామన్నారు. విద్యుత్‌ ధరలు పెంచబోమని చెప్పిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, హైదరాబాద్‌ అభివృద్ధి ప్రతి అడుగులో తన కృషి ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కేంద్రంతో కుమ్మక్కై రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు.

తాజావార్తలు