బాబ్‌గిలానీకి సాహిత్యరంగ నోబుల్‌ పురస్కారం

స్విడన్‌,అక్టోబర్‌ 13(జనంసాక్షి): అమెరికన్‌ గాయకుడు, గీత రచయిత బాబ్‌ డిలాన్‌కు సాహిత్య రంగంలో నోబెల్‌ పురస్కారం లభించింది. అమెరికన్‌ పాటల సాంప్రదాయంలో బాబ్‌ డిలాన్‌ ఓ సరికొత్త కవితాత్మక వ్యక్తీకరణ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు ఈ అవార్డును ప్రకటిస్తూ స్విడిష్‌ అకాడవిూ సంస్థ పేర్కొంది. దీంతో నోబెల్‌ పురస్కారం అందుకున్న తొలి గీతరచయితగా బాబ్‌ డిలాన్‌ చరిత్ర సృష్టించారు. ఇప్పటికే వైద్యశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, శాంతి, ఆర్థిక రంగాల్లో నోబెల్‌ బహుమతులు ప్రకటించిన సంస్థ తాజాగా నేడు సాహిత్యరంగంలో నోబెల్‌ను ప్రకటించింది. అవార్డు ప్రకటనకు ముందు యథావిధిగా జరిగే పుకార్లననుసరించి వివాదాస్పద రచయితలైన సిరియన్‌ కవి అడోనిస్‌కు గానీ కెన్యన్‌ రచయితైన నూగిగీ వా థియోంగ్‌ను గానీ ఈ ఏడాది నోబెల్‌ వరించనున్నట్లు ప్రచారం జరిగింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికన్‌ గాయకుడు, గీత రచయిత బాబ్‌ డిలాన్‌ను అవార్డు వరించింది.