బాలకృష్ణారెడ్డి వందేళ్లు చల్లగా ఉండాలి

తూప్రాన్ పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి వందేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు బాలకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా ఆయనను స్వాగతం సన్మానించి ఆశీర్వదించారు ఆ తర్వాత తూప్రాన్ సహకార సొసైటీ సంఘ ఆవరణలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణారెడ్డి వందేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను తెలిపారు సహకార సంఘం ఆధ్వర్యంలో తూప్రాన్ మనోహరాబాద్ మండలాలలో రైతులకు అండగా ఉండి దాని 8 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఘనత సంఘానికి దక్కుతుందని అన్నారు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులకు బాసటగా ఉండి ఎరువులు అందుబాటులో ఉంచి సకాలంలో అందించిన ఘనత దక్కుతుందని అన్నారు అల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం జరగకుండా సకాలంలో అందించామని అన్నారు అనంతరం బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాన్ని రైతులకు అండగా ఉండి సకాలంలో రుణాలు అందజేశామని తెలిపారు సహకార సంఘ భవన నిర్మాణానికి ప్రతిపదలను సిద్ధం చేశామని మంజూరు కాగానే భవన నిర్మాణం కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు తన జన్మదిన సందర్భంగా ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు భగవంతు రెడ్డి జిల్లా నాయకులు చంద్రశేఖర్ సొసైటీ డైరెక్టర్లు సంతోష్ రెడ్డి జావేద్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆయనను పూలదండలు శాలువతో సన్మానించారు అనంతరం మొక్కను నాటారు