బాలికపై అత్యాచారయత్నం యువకుడి అరెస్ట్‌

 

విజయనగరం: నగరంలోని తోటపాలెం ముత్యవాణి చెరువు వద్ద 6గురు మైనర్‌ బాలికలపై ఒక యువకుడు అత్యచార యత్నం చేశాడు. ముత్యవాణి చెరువు ప్రాంతానికి చెందిన 6గురు బాలికలపై అదే గ్రామానికి చెందిన పోలుపల్లి వేణు శుక్రవారం వారి తల్లిదండ్రులు లేని సమయంలో తన ఇంట్లోకి పిలిపించాడు. వారిలో ఒక బాలికపై హత్యచారయత్నానికి పాల్పడినాడు. మిగితా 5గురి నోట్లో గుడ్డలు కుక్కి అశ్లీలంగా ఫోటోలు తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే వారి ఫోటోలను బయటపెడుతానని బెదిరించాడు. 2రోజుల తర్వాత బాలికలు జరిగిన విషయాన్ని తమ బంధువులకు చెప్పడంతో వారు ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు.