బాలిక అనుమనాస్పద మృతి
స్ఫూర్తి ఫౌండేసన్ తీరుపై బంధువుల ధర్నా
మేడ్చెల్,జూలై30(జనంసాక్షి): మేడ్చల్ జిల్లా దుండిగల్ పి.యస్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. స్ఫూర్తి ఫౌండేషన్‌లో ఈనెల 27వ తేదీన యాజమాన్యం నిర్లక్ష్యంతో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ను ఫౌండేషన్ నిర్వాహకులు గోప్యంగా ఉంచి అనంతరం దుండిగల్ పోలీసులుకు సమాచారం ఇచ్చారు. మొదట బాలిక ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిందని.. తరువాత మెట్లకు ఉరివేసుకుని చనిపోయిందని నిమిషానికి ఒక మాట మార్చారు. ఫౌండేషన్ యజమానులు
పోలీసులు రాక ముందే శవాన్ని బయటకు తీసి ఇంట్లో వారు రాక ముందే గాంధీ మార్చురీకి తరలించారు.
ఈ విషయంపై భగ్గుమన్న బీసీ సంఘాల నాయకులు ఆశ్రమం వద్దకు చేరుకొని ధర్నా చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐకి పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పి యాజమాన్యంపై ఎటువంటి ఏంక్వైరీ చేయడం లేదని ఘటన జరిగి 3 రోజులు కావొస్తున్న ఫౌండేషన్ చైర్మన్ ను అరెస్ట్ చేయలేదని నిరసిస్తూ బాలిక శవంతో ఫౌండేషన్ గేట్ ముందు ధర్నాకు దిగారు. ఉదయం నుండి అక్కడే కూర్చొని ఉండగా పెద్ద ఎత్తున దుండిగల్ పోలీసులు మోహరించి బందోబస్తు చేపట్టారు.