బాలీవుడ్ సీనియర్‌నటుడు ప్రాణ్‌కు అస్వస్థత
ముంబయి : అలనాటి బాలీవుడ్ ప్రతినాయకుడు ప్రాణ్ అస్వస్థతతో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఒక చెకప్‌కోసం ఆయన ఆసుపత్రికి వచ్చారని, అయితే శ్వాసకోశ సమస్య ఉన్నట్లు గుర్తించడంతో ఇన్ పేషెంట్‌గా అడ్మిట్ చేసుకున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. ఖాందాన్, ఔరత్, జిస్ దేశ్‌మే గంగా బెహతీ హై, ఉపకార్, డాన్, జంజీర్ వంటి సూపర్ హిట్ చిత్రాలతోపాటు 350 చిత్రాలలో ప్రాణ్ నటించారు. 2001 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేసింది.